పవన్ జనసేన మీటింగ్ లో దుమ్మురేపనున్న బండ్లన్న!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నటుడుగా కంటే పవన్ వీరాభిమానిగా ఎక్కువ పరిచయం పెంచుకున్నాడు. ఈయన పవన్ గురించి మాట్లాడితే చాలు అది పెద్ద హైలెట్ గా మారిపోతుంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఈవెంట్ కు చాలామంది బండ్ల స్పీచ్ కోసమే వస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చే స్పీచ్ అలా ఉంటుంది కాబట్టి.

ఇక రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేయడంతో అక్కడ బండ్ల దుమ్మురేపనున్నాడు. ఈ విధంగా ట్విట్టర్లో ‘వీరులారా.. ధీరులారా.. జనసేన సైనికులారా.. రండి కదలి రండి కడలి అలగా తరలిరండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయితీకి సాక్షిగా నిలబడటం కోసం.. తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం.. అమరావతి నుంచి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం’ అంటూ ట్వీట్ చేసాడు.