వైరల్ : పవన్ తో సినిమాపై ఫ్యాన్స్ కి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..!

తెలుగు సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. మరి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు సినిమాలు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండగా మళ్లీ ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నారు. అయితే ఈ చిత్రాల్లో ఆల్రెడీ కొన్ని ఇంకా పెండింగ్ లోనే ఉండిపోగా.. కొన్ని ఇంకా ఓకే చేసినవి కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉంది.

దీనితో పవన్ నుంచి సినిమాలు కోరుకునే వారు కూడా వాటి కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాల్లో పవన్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా పవన్ తో మళ్లీ ఇంకో సినిమా చేయడానికి ఓకే చేయించుకున్నారు. అయితే ఈ సినిమా మొదలు పూర్తి పై అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ లేటెస్ట్ గా అయితే పవన్ తో చేసే సినిమాపై షాకింగ్ క్లారిటీ పవన్ అభిమానులు కు అందించడం ఒకింత ఆసక్తి గా మారింది.

పవన్ ని ఇప్పుడు సినిమా హీరోగా కన్నా రాజకీయాల్లోనే చూడాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. “మనది నిజమైన అభిమానం అయితే మనం నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన చేయబోతున్న కార్యక్రమానికి కలగాలని కోరుకుందాం సినిమా వ్యాపారం ఆయన్ని దయచేసి ఇబ్బంది పెట్టకూడదు ఇది మన బాధ్యత ఆయన స్థానం వేరు ఆయన స్థాయి వేరు” అంటూ ఒక ఊహించని క్లారిటీ పవన్ తో సినిమాపై ఇవ్వడం వైరల్ గా మారింది .

ఇది వరకు ఇలాంటి ప్రశ్నలు వస్తే తాను టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పేవాడు కానీ ఈసారి పవన్ రాజకీయాల్లో చేసేది చేసుకోవడం మంచిది అని పైగా పవన్ ఫ్యాన్స్ కే క్లాస్ పీకినట్టు చేసాడు బండ్ల.. దీనితో కొందరు పవన్ ఫ్యాన్స్ అయితే హ్యాపీ గానే ఉన్నారు.