బాలయ్య స్పీడ్ మామూలుగా లేదుగా.. సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న బాలయ్య టాక్ షో?

బాలకృష్ణ ప్రస్తుతం ఆహా వేదికగా  ‘అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ అనే టాక్‌ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఇంటర్వ్యూ ఇచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది హీరోలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం దీపావళి పండుగ సందర్భంగా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ లో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రేక్షకులను సందడి చేశారు. అలాగే రెండవ ఎపిసోడ్ లో భాగంగా నాచురల్ స్టార్ నాని ప్రేక్షకులను సందడి చేయడంతో ఆహాకు పెద్ద మొత్తంలో సబ్స్క్రైబర్లు పెరిగారు.

అయితే ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకులను సందడి చేస్తూ ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం కేవలం రెండు ఎపిసోడ్ లు మాత్రమే ప్రసారమైంది. బాలకృష్ణ చేతికి సర్జరీ జరగడం వల్ల కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమం సరికొత్త రికార్డును సృష్టించింది. ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లో ఏకంగా 4 మిలియన్లకు పైగా లైక్‌లతో ఈ కార్యక్రమం రికార్డును సృష్టించిందని చెప్పవచ్చు.

అలాగే ఈ షో 4 మిలియన్లకుపైగా వీడియో ప్లేతో మొదటి స్థానంలో నిలిచింది. ఇకపోతే గత కొద్దిరోజుల నుంచి వాయిదా పడిన ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ఈ ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.