బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 2 నుంచి క్రేజీ అప్డేట్.. ముందుగానే ప్రసారం కానున్న టాక్ షో?

నందమూరి బాలకృష్ణ గతంలో మొట్టమొదటిసారిగా ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. హీరోగా వందల సినిమాలలో నటించి వెండితెర ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ ఓటిటిలో ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. బాలకృష్ణ పోస్ట్ చేసిన ఈ టాక్ షో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న సెలబ్రిటీలతో కలసి బాలకృష్ణ చాలా సందడి చేసాడు. ఆహాలో స్ట్రీమ్ అయిన మొదటి రియాల్టీ షో అన్ స్టాపబుల్ . ఈ షోలో బాలకృష్ణ తన మాటలతో ప్రేక్షకులను గారడీ చేశాడు. ఈ షో మొదటి సీజన్ మంచి హిట్ అవటంతో సెకండ్ సీజన్ పనులు కూడా మొదలు పెట్టారు.

ప్రస్తుతం ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కూడా బాలకృష్ణ హోస్ట్ గా సందడి చేయనున్నాడు. అయితే సీజన్ 1 ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్, ఫన్ తో సీజన్ 2 కొనసాగనుందని బాలకృష్ణ ఒక షో లో వెల్లడించారు. మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలో అన్ స్టాపబుల్ రియాలిటీ షో 9.7 రేటింగ్‌తో IMDBలో మొదటి స్థానంలో నిలిచింది. మొదటి సీజన్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ సందడి చేశారు. అయితే మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లోనే చాలా మంది అగ్రహీరోలు ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. దీంతో అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అదిగో ఇదిగో అంటూ మేకర్స్ సర్ది చెప్తున్నారు తప్ప సీజన్ 2కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రావడం లేదని నెటిజన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఎట్టకేలకు ఈ షోను ఆగస్టు రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని సమాచారం. అయితే ఈ విషయం గురించి తొందర్లోనే అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు.