పవన్ 3 పెళ్లిళ్లు..బాలయ్య సంచలన కౌంటర్ వైరల్.!

Unstoppable-S2-Pawan-Kalyan-will-have-these-2-directors-beside-him-1024x768

గాడ్ ఆఫ్ మాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే తన మొదటి ఓటిటి డెబ్యూట్ ని మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న పాపులర్ షో అన్ స్టాప్పబుల్ లో అయితే హాజరు అయ్యిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఫైనల్ ఎపిసోడ్ కాగా దీనిని కూడా ప్రభాస్ ఎపిసోడ్ లానే రెండు పార్ట్ లుగా ప్లాన్ చేశారు.

మరి ఈ ఎపిసోడ్ అయితే ఓ రేంజ్ లో హైప్ తెచ్చుకోగా మొదటి 90 నిమిషాల్లోనే పాత రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులు సెట్ చేసింది. ఇక దీనికి స్పెషల్ స్క్రీనింగ్ కూడా వేసి ట్రెండ్ సెట్ చేయగా ఈ ఎపిసోడ్ లో పవన్ మూడు పెళ్లిళ్లు కోసం కూడా టాపిక్ రాగా ఇది చాలా స్మూత్ గానే ముగిసింది.

కానీ పవన్ పై తన మూడు పెళ్లిళ్లు కోసం అనవసరంగా మాట్లాడే వారికి బాలయ్య అదిరే కౌంటర్ ఇవ్వడం వైరల్ గా మారింది. పవన్ పెళ్లిళ్ల కోసం ఇంకెవరైనా కూడా మాట్లాడినా విమర్శించినా వాళ్ళు ఊరకుక్కలతో సమానం అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ని తన మాటగా ఈ షో వేదిక నుంచి అందించారు.

కాగా దీనికి కూడా పవన్ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పాజిటివ్ గా మంచి కౌంటర్ ఇచ్చారు అన్నట్టుగా ఒప్పుకోవడం కూడా ఆసక్తిగా మారింది. దీనితో బాలయ్య ఇచ్చిన కౌంటర్ తో మాత్రం పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.