చెల్లెలి పాడే మోస్తూ.. కన్నీటి వీడ్కోలు చెప్పిన బాలయ్య?

దివంగత నటుడు నాయకుడు నందమూరి తారక రామారావు నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఈమె ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు.ఇక ఉమామహేశ్వరి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకున్నారు.సోమవారం మరణించిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు నేడు పూర్తి అయ్యాయి.

ఉమా మహేశ్వరి అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఈమె మరణ వార్త తెలుసుకున్న నటుడు బాలకృష్ణ హుటా హుటిన తన సోదరీ ఇంటికి చేరి ఒక్కసారిగా కన్నీటి పర్యంతరమయ్యారు. బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి కూతుర్లు సైతం ఉమామహేశ్వరి ఇంటి వద్దనే ఉన్నారు. ఇకపోతే నేడు మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలను జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించారు.

ఇక చెల్లెలు అంత్యక్రియలలో భాగంగా బాలకృష్ణ స్వయంగా పాడే మోసి తన చెల్లెలకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా బాలకృష్ణ తన చెల్లెలకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ తన అంత్యక్రియలను నిర్వహించారు.ఇకపోతే ఈమె అనారోగ్యం కారణంగా మనస్థాపం చెంది మృతి చెందిందా లేకపోతే మరేదైనా సమస్యలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. అంత్యక్రియలలో ఎన్టీఆర్ పాల్గొనలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఇంగ్లాండ్ వెకేషన్ లో ఉండటం వల్ల తన అత్తయ్య అంతక్రియలకు రాలేకపోయారని సమాచారం.