సెన్సార్ రిపోర్ట్ : “భగవంత్ కేసరి” రిజల్ట్ ఇదే..!

ఈ దసరా కానుకగా అయితే సౌత్ ఇండియా సినిమా దగ్గర రాబోతున్న పలు భారీ చిత్రాల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న చిత్రాలు రెండు ఉన్నాయి. కాగా ఈ చిత్రాల్లో టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా “భగవంత్ కేసరి” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఈ రిలీజ్ పై ఇప్పుడు మరింత హైప్ ఎక్కించేలా సినిమా సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా భగవంత్ కేసరి చూసిన సెన్సార్ యూనిట్ అయితే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ అందించారు అట.

సినిమా చాలా బాగా వచ్చింది అని అంతే కాకుండా దర్శకుడు అనీల్ అయితే బాలయ్య నెవర్ బిఫోర్ గా ప్రెజెంట్ చేసాడు అని ఇది మంచి హైలైట్ కాగా ఇంటర్వెల్ బ్లాక్ లో అయితే థమన్ ఇచ్చిన స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని రీసెంట్ గా థమన్ పై వచ్చిన అన్ని కామెంట్స్ కి సమాధానం అందిస్తుంది అని అంటున్నారు.

దీనితో భగవంత్ కేసరి మాత్రం ఓ సూపర్ పాజిటివ్ రిపోర్ట్ ని అందుకున్నట్టే ఉందని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే ఈ అక్టోబర్ 19 వరకు ఆగాల్సిందే. ఇంకా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించగా శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది.