దర్శకుడు శరత్ పట్ల ఎమోషనల్ అయిన బాలయ్య!

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు శరత్ గత కొన్ని రోజుల నుండి క్యాన్సర్ తో బాధపడుతూ ఈ రోజు ఉదయం లోకాన్ని వదిలి వెళ్లారు. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆయన ఆత్మ శాంతించాలి అని సంతాపం తెలియజేస్తున్నారు.

ఇక పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికగా ఈయనకు సంతాపం తెలుపుతూ బాధపడుతున్నారు. తాజాగా బాలకృష్ణ కూడా ఈయన మరణాన్ని తట్టుకోలేకపోయాడు. మంచి దర్శకుడిని, ఆప్తుడిని కోల్పోయామని ఎమోషనల్ అయ్యాడు. ఆయన తనకు ఎంతో ఆప్తుడు అని.. చిత్ర పరిశ్రమలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు అని అన్నాడు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.