టాలీవుడ్ ఇద్దరు మాస్ గాడ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ లు గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మాస్ గాడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ లు ఒకే వేదిక పైకి రానున్నారు అనేది ఓ రేంజ్ లో సోషల్ మీడియా సహా తెలుగు సినిమాలో గట్టిగా వైరల్ అవుతున్నారు.
అలాగే ఇప్పుడు అయితే ఫైనల్ గా ఈ మాసివ్ ఎపిసోడ్ ఈరోజు అల్లు వారి సారథ్యంలో షూటింగ్ వచ్చేసింది. ఇక ఈ ఇద్దరు సూపర్ పర్సనాలిటీస్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కనిపిస్తుంది. మరి పవన్ బాలయ్య షో దగ్గరకి ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళక ముందే సినీ ప్రముఖులు అభిమానుల మధ్య పవన్ గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది.
ఇక ఈ వీడియోలో అయితే పవన్ తన కార్ లో రాగానే బాలయ్య ఆప్యాయంగా పవన్ ని పలకరించి హగ్ చేసుకొని మరీ తనని ఆహ్వానించారు. ఇక దీనితో అక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్స్ కూడా ఓ రేంజ్ లో కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ ఎంట్రీ తర్వాత ఆన్ స్టేజ్ పై బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ ల ఫ్రేమ్ లు ఈరోజే బయటకి వచ్చేసి వైరల్ గా మారుతున్నాయి.
దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల మెగా సహా నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకోనుండగా బహుశా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా లేదా సీజన్ ఎండింగ్ కి ఇవ్వనున్నారని టాక్.
.@PawanKalyan at #UnstoppableWithNBKS2 shoot. 🔥💥pic.twitter.com/pNiZQuod3s
— Trend PSPK (@TrendPSPK) December 27, 2022