ఇప్పటికే సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే సీనియర్ నటుడి గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ కొడుకు ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ కొన్ని సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ నిరాశకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోని గతంలో మోక్షజ్ఞను పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాల వల్ల పూరి బిజీగా ఉండటం వల్ల మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయారని వార్తలు వచ్చాయి. అయితే తన కొడుకు బాధ్యతను బాలకృష్ణ పూర్తిగా బోయపాటి శ్రీను చేతిలో పెట్టినట్లు వార్తలు షికార్లు చేసినప్పటికీ ఈ వార్తలలో కూడా ఏమాత్రం నిజం లేదని క్లారిటీ వచ్చింది.అయితే మోక్షజ్ఞ అధిక శరీర బరువు కారణంగా ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారని ముందుగా తనను తన ఫిట్నెస్ పై దృష్టి సారించి బాగా శరీర బరువు తగ్గారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే నటనలో శిక్షణ పొందిన మోక్షజ్ఞ శరీర బరువు కూడా తగ్గడంతో ఈయన ఈసారి తప్పకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని వార్తలు షికార్లు చేస్తున్నాయి.అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత ఈసారి అనిల్ రావిపూడి పై ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ దర్శకత్వం వహించే సినిమాలలో ఎంటర్టైన్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి,తన హీరోతో కామెడీ నుండి ఫైట్స్ , రొమాన్స్ అన్నీ చేయిస్తూ ఉంటాడు. అనిల్ అయితేనే సేఫ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని అందుకే ఆ బాధ్యతలను అనిల్ కి అప్పజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.