త్వరలోనే ఆఖండ సీక్వెల్ ఉందంటూ క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. సంతోషంలో ఫ్యాన్స్!

నందమూరి నటసింహం తాజాగా నటించిన చిత్రం ఆఖండ బోయపాటి శ్రీను కాంబినేషన్లో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా అఖండమైన విజయాన్ని అందుకోవడంతో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాలలో భాగంగా అఖండ సినిమాని ప్రత్యేక ప్రదర్శన వేశారు.

ఇలా అఖండ సినిమా ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కావడంతో ఆఖండ చిత్ర బృందం సైతం ఈ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం అఖండ సినిమా సీక్వెల్ గురించి తెలియజేశారు.ఈ సినిమా సీక్వెల్ తప్పనిసరిగా ఉంటుందని త్వరలోనే ఈ సినిమా సీక్వెల్స్ మీ ముందుకు రాబోతుంది అంటూ బాలయ్య తెలియచేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైందని సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ నిర్ణయిస్తుంది అంటూ బాలయ్య సీక్వెల్ సినిమా గురించి వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అఖండ సినిమాతో సంచలనాలను సృష్టించిన బాలకృష్ణ ఈ సినిమా సీక్వెల్ తో మరి ఎలాంటి రికార్డులను సృష్టిస్తారో తెలియాల్సి ఉంది. ఇకపోతే అఖండ సినిమా డిసెంబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలను సృష్టించింది.