అన్ స్టాపబుల్ 2కి రెండింతలు రెమ్యూనరేషన్ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వెండితెరపై అందరిని మెప్పించారు.ఇలా తన నటనతో అందరిని ఆకట్టుకున్న బాలయ్య తనలో మరొక యాంగిల్ కూడా ఉందంటూ ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వ్యాఖ్యాతగా తనేంటో నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సెలబ్రిటీలను పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ అందరి సందేహాలను తీర్చారు.ఈ విధంగా బాలకృష్ణ ఈ కార్యక్రమాల ద్వారా విపరీతమైన ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని నెంబర్ వన్ టాక్ షో గా నిలబెట్టారు.

ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ఎంతోమంది హీరోలు వారి గురించి వస్తున్న రూమర్లు గాసిపులు గురించి కూడా ఈ కార్యక్రమంతో చెక్ పెట్టారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా మోహన్ బాబు హాజరుకాగా చివరిగా మహేష్ బాబు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంతో ఆహాకు విపరీతమైన సబ్స్క్రైబర్లు కూడా పెరిగిపోయారు. ఇకపోతే ఈ కార్యక్రమం సీజన్ 2 ప్రసారమవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమాకి సంబంధించిన అప్డేట్ ఆగస్టు రెండవ వారంలో ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే ఈ కార్యక్రమం మొదటి సీజన్ కోసం బాలకృష్ణ ఒక్కో ఎపిసోడ్ కు 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా సీజన్ 2 కార్యక్రమం కోసం బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ రెండింతలు పెంచారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం బాలకృష్ణ ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.