వైరల్ : పవన్ ఎపిసోడ్ లో హైలైట్ గా బాలయ్య డైలాగ్.!

ఇద్దరు మాస్ గాడ్ లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నందమూరి నటసింహం బాలకృష్ణ లు ఓకే వేదిక మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ షో ఆహాలో ప్రసారం అయ్యే అన్ స్టాప్పబుల్ సీజన్ 2 కాగా ఇందులో ఫైనల్ ఎపిసోడ్ గా అయితే పవర్ స్టార్ తో ప్లాన్ చేయగా దీనిపై భారీ హైప్ సెట్టయ్యింది.

అలా అక్కడ నుంచి ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేయడం దానికి ఆహా హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు స్పందన కూడా రావడం విశేషం. మరి ఇదిలా ఉండగా దీనికి పార్ట్ 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిన్ననే మేకర్స్ ఆ ఎపిసోడ్ తాలూకా ప్రోమో ని బయటకి తీసుకొచ్చారు.

మరి ఈ ప్రోమో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ గా ఉండగా ఇందులో మాత్రం బాలయ్య లాస్ట్ లో పేల్చిన డైలాగ్ సినీ వర్గాల్లో మరియు ఫ్యాన్స్ మధ్య వైరల్ గా మారింది. పవన్ తో మాట్లాడుతూ “అణువునైనా ఇరుకున పెడితే అణుబాంబు వస్తుంది” అంటూ చెప్పిన ఎలివేషన్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

అయితే ఈ ఎపిసోడ్ ఈ ఫిబ్రవరి 10 నుంచి ఆహా లో స్ట్రీమ్ కానుండగా దీనికి కూడా రికార్డు రెస్పాన్స్ వస్తుందని ఆహా వారు ఆశిస్తున్నారు. కాగా ఈ ఎపిసోడ్ కి ముఖ్య గెస్ట్ గా క్రిష్ జాగర్లమూడి వచ్చారు. అలాగే తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” చిత్రం ని చేస్తున్న సంగతి తెలిసిందే. 
Unstoppable With NBK S2 | POWER FINALE Part 2 | PROMO | Pawan Kalyan, NBK | ahaVideoIN