యంగ్ హీరో సినిమాలో నందమూరి బాలకృష్ణ.!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ పనుల్లో బిజీగా వున్నారు. ఓ మల్టీస్టారర్ కథాంశం ఆయన ముందుకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బాలకృష్ణ ‘జైలర్’ సినిమాలో గెస్ట్ రోల్ చేయాల్సి వుంది.

ఇదిలా వుంటే, తాజాగా నందమూరి బాలకృష్ణ ఓ యంగ్ హీరో సినిమాలో స్పెషల్ రోల్ చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఆ యంగ్ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ మధ్య సీనియర్ హీరోలు మల్టీస్టారర్ల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే.

బాలయ్య కూడా ఆ దిశగా ముందడుగు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క, నందమూరి బాలకృష్ణ, ఓ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారట.. అదీ ఓ యంగ్ హీరో సినిమా షూటింగ్ స్పాట్‌లో.

ఆ యంగ్ హీరో ఎవరో కాదు విశ్వక్ సేన్. బాలయ్యకు వీరాభిమాని అయిపోయాడు విశ్వక్ సేన్. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆ బాలయ్యతో కలిసి నటించాలనీ, కుదిరితే బాలయ్య సినిమాకి దర్శకత్వం చేస్తాననీ విశ్వక్ సేన్ గతంలోనే చెప్పాడు.

ఇదే మాట దాదాపు ఎన్టీయార్ విషయంలోనూ చెప్పాడనుకోండి విశ్వక్ సేన్ అది వేరే సంగతి. తన సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన బాలయ్యతో, మల్టీస్టారర్ గురించి విశ్వక్ సేన్ చర్చించాడట. ఆ సరదా, ఇప్పుడు జరుగుతున్న సినిమాతోనే ఓ అతిథి పాత్ర ద్వారా తీర్చేసుకోమని బాలయ్య అన్నాడన్నది తాజా ఖబర్.