క‌రోనా వ్యాక్సిన్‌ రాలేదు, ఇక రాదు కూడా .. స‌హ‌జీవ‌నం చేయాల్సిందేనంటూ బాల‌య్య షాకింగ్ కామెంట్స్

Balakrishna sensational contents on carona vaccine

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ని వ‌ణికిస్తుంది. ఎవరైన అజాగ్ర‌త్త‌గా ఉంటే క‌రోనాకు బ‌లి కావ‌ల్సిందేనంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీల‌ని కాటికి పంపిన క‌రోనా చాలా మందిపై ప‌గ‌బ‌ట్టింది. ఈ క‌రోనా భ‌యంతో ప్ర‌తి ఒక్క‌రు వ‌ణికిపోతున్నారు. టీకా వ‌స్తే కొంచెం శాంతంగా ఉండొచ్చ‌ని ఊహాలోచ‌న‌లు చేస్తున్నారు. ఈ మ‌ధ్య ఫైజర్, బయోఎన్‌టెక్‌ టీకా సరఫరా ఈ ఏడాది చివర్లో లేదా , వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అవుతుందని టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సీనియర్‌ శాస్త్రవేత్త ఆదివారం చెప్పారు

Balakrishna sensational contents on carona vaccine

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులను స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఫైజ‌ర్ సంస్థ భావిస్తుంది. అయితే క‌రోనా వ్యాక్సిన్ పై తాజాగా ప్ర‌ముఖ న‌టుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.‘సెహరీ’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను లాంచ్ చేయ‌డానికి వ‌చ్చిన ఆయ‌న క‌రోనా వ్యాక్సిన్ రాలేదు, ఇక రాదు. వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని అంటున్నారు కాని, అది రాదు. క‌రోనా మ‌న జీవితాంతం ఉంటుంది. దాంతో స‌హజీవ‌నం చేస్తూ త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని బాలయ్య స్ట‌న్నింగ్ కామెంట్స్ చేశారు.

వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై బాలయ్య నీళ్ళు చ‌ల్లారు. బాల‌య్య చేసిన సంచ‌లన కామెంట్స్ పై ఎవ‌రైన స్పందిస్తారా అనేది చూడాలి. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో బీబీ ( వ‌ర్కింగ్ టైటిల్ ) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంది. సాయేషా సైగ‌ల్ కథానాయిక‌గా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.