తెలుగుదనం లేదంటూ సినిమా టైటిల్ ని రిజెక్ట్ చేసిన బాలయ్య..?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి అతి తక్కువ కాలంలోనే దర్శకుడుగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ త్రీ సినిమా విడుదలై మంచి హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బికె 107 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేయనున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తండ్రి, కూతురు మధ్య వున్న అనుబంధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూతురు పాత్రకి శ్రీ లీలను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియమణిని అనుకున్నారు. అయితే ఇంకా కన్ఫామ్ చేయలేదు. ఇతర నటీనటుల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి.అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాక ‘బ్రో ఐ డోన్ట్ కేర్’ అనే టైటిల్ పెట్టాలని అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

స్క్రిప్ట్ డిమాండ్, బాలయ్య ఇమేజ్‌కి ఈ టైటిల్ సరిగ్గా సూటవుతుందని భావించి, అదే ఫిక్స్ చేయాలని అనిల్ డిసైడ్ అయినట్టు సమాచారం.దాదాపు ఈ టైటిల్ ఖరారు అయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ఈ టైటిల్ ని రిజెక్ట్ చేశాడట. టైటిల్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ, ఈ టైటిల్ లో తెలుగుదనం లేదన్న భావనతో బాలయ్య దీనిని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో టైటిల్ కోసం అనిల్ రావిపూడి మళ్ళీ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.