Gallery

Home Entertainment వైరల్ గా మారిన బాలకృష్ణ న్యూ లుక్ !

వైరల్ గా మారిన బాలకృష్ణ న్యూ లుక్ !

సినిమా సినిమాకు కొత్త లుక్ చేయమన్నా కూడా ఏ మాత్రం అలిసిపోకుండా ప్రయత్నించే హీరో బాలయ్య బాబు. అందుకే ఈయన్ని డైరెక్టర్స్ హీరో అని పిలుస్తుంటారు కూడా. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి తనవంతుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు నటసింహం. ఇప్పుడు కూడా బోయపాటి సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. ఈయనతో గతంలో చేసిన సింహా, లెజెండ్ సినిమాల కోసం కొత్త బాలయ్యను చూసారు అభిమానులు. ఇప్పుడు మూడోసారి కాంబినేషన్‌లో కూడా అదే చేస్తున్నాడు బోయపాటి. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించనంత కొత్తగా, అందంగా చూపించబోతున్నాడు

Balakrishna New Look: వైరల్ అవుతున్న బాలకృష్ణ న్యూ లుక్.. హోలీ సంబరాల్లో లీక్..

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో మరో సంచలన పాత్ర కూడా చేస్తున్నాడు నందమూరి నటసింహం. అదే అఘోరా.. సాధారణంగా స్టార్ హీరోలు కనీసం ఆలోచించడానికి కూడా భయపడే పాత్ర ఇది. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్నాడని ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రోల్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. రిస్క్‌తో కూడుకున్న పాత్ర కావడంతో ఎక్కడా ఆ చిన్న అశ్రద్ధ కూడా లేకుండా కారెక్టర్ డిజైన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య.

ఇంటర్వెల్ టైమ్‌కు అఘోరా పాత్ర ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్‌కు ఫిదా అయిపోయారు. వరస డిజాస్టర్స్‌లో ఉన్న బాలయ్యకు బోయపాటి శ్రీను సినిమా కీలకంగా మారింది. పక్కా కమర్షియల్ మాస్ ఫార్ములాతోనే ఈ సినిమా వస్తుంది. అందులోనే కాస్త భిన్నంగా బాలయ్యను అఘోరాగా మార్చేస్తున్నాడు బోయపాటి.

ఈ పాత్ర కోసం బాలయ్య కూడా చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా బరువు కూడా తగ్గిపోయాడు. మరో పాత్ర కోసం బరువు పెరిగాడు. ఇలా రెండు కారెక్టర్స్ కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాడు నందమూరి నటసింహం. అందుకే అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా హొలీ పండుగను ‘BB3’ చిత్ర బృందంతో కలిసి జరుపుకున్నాడు బాలయ్య. అక్కడే ఓ చిన్న పాపతో రంగులు పూయించుకుంటున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో బాలయ్య లుక్ కూడా అభిమానులను అలరిస్తుంది.నెరిసిన గడ్డం.. చిన్నపాటి జుట్టుతో కొత్తగా డిఫరెంట్‌గా ఉన్నాడు. ఈ లుక్ గతంలో ఏ సినిమాలో కూడా బాలకృష్ణ ట్రై చేయలేదు. ఈ గెటప్ బోయపాటి కోసమే అనేది అర్థమవుతుంది. అఘోరా పాత్ర అంటే మరీ భయంకరంగా కాకుండా కాస్త కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

Related Posts

అప్పుడే కోవిడ్ 19 కొత్త షాక్.. టాలీవుడ్ పరిస్థితేంటి.?

కరోనా రెండో వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అయితే, థియేటర్లు ఇటీవల తెరచుకోవడంతో రెండు చిన్న సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. హమ్మయ్యా.. అని తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది....

భయపడుతూ.. ధియేటర్లో సినిమా చూడలేం: ప్రేక్షకులు

సినీ పరిశ్రమకి ఇది చాలా పెద్ద షాక్. ఈ రోజు తెలుగు రాష్ర్టాల్లో సినిమా ధియేటర్లు తెరచుకున్నాయనే మాటే కానీ, ధియేటర్ల దగ్గర పెద్దగా ప్రేక్షకులు కనిపించలేదు. నిన్ననే సినీ నటుడు పోసాని...

తెలుగు సినిమాని ఎవరు చంపేశారు.? కరోనా మాత్రం కాదు సుమీ.!

కరోనా దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. నిజానికి, కరోనా వైరస్ కంటే ముందే తెలుగు సినీ పరిశ్రమలో సంక్షోభం బయల్దేరింది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాల్ని చంపేస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఇంకోపక్క పెద్ద...

Latest News