Balakrishna: శీలం లేనివాడిని పొడవడానికి శూలం ఎందుకురా అంటూ మాస్ డైలాగులను పేల్చిన బాలయ్య!

Balakrishna: నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో విజయవంతం చేశారు. ఇందులో బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.ముఖ్యంగా ఈ సినిమాలో హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ డైలాగులను పలు హిందూ సంఘాల నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు హిందూ దేవాలయంలో కూర్చుని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ దేవుడిని అపహాస్యం చేస్తుంటారు. ఇక దీంతో శివుడి రూపంలో ఉన్నటువంటి బాలకృష్ణ అక్కడికి వెళ్లి ఆ ఆకతాయి పని పడతారు. ఆ సమయంలో బాలకృష్ణ దైవం జోలికి వస్తే దవడ పగిలిపోద్ది అంటూ చేతిలో ఉన్న శూలం చూపించగా ఆ కొందరు వ్యక్తులు ఏంటి శూలంతో పొడుస్తావా అంటూ హేళన చేస్తారు.

ఈ క్రమంలో బాలకృష్ణ మరొక ఆటంబాంబు లాంటి డైలాగు పేల్చారు. శీలం లేని వాడిని పొడవడానికి శూలం ఎందుకురా గాడిద అనే డైలాగ్ చెప్పడంతో థియేటర్ లో సందడి వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇలా ఎన్నో సంవత్సరాల తర్వాత బాలకృష్ణ ఇలాంటి అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో నిజంగా నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సినిమాగా అఖండ నిలిచిపోయింది. ఇదివరకే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోని అఖండ సినిమా కూడా అఖండమైన విజయాన్ని అందించింది అని చెప్పవచ్చు.