Balakrishna : మహేష్ కోసం బాలయ్య రానున్నాడా… సర్కారు వారి పాట ఈవెంట్ కు బాలకృష్ణ వస్తాడా.?

Balakrishna:సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారు వారి పాట విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక మహేష్ సరసన ఈ సినిమా లో కీర్తి సురేష్ నటించింది. యాక్షన్ తో పాటు ఎంటర్టైనర్ గా ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ను మే 12 నా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా లో మహేష్ యంగ్ లుక్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. బ్యాంకింగ్ రంగం లో జరిగే మోసాలు గురించి సాగే కథగా సర్కారు వారి పాట సినిమా రాబోతోంది.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల చివరికి సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టి ఎందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. షూటింగ్ కూడా చివరి దశకు వస్తుండటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులు కూడా మెల్ల మెల్లగా జోరందుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు కూడా విడుదల చేశారు.ఇప్పటికే రిలీజ్ అయినా కళావతి పాట సంగీత మధ్యమాలను ఉపేసింది. ఇక రెండో పాట గురించి చెప్పనక్కర్లేదు అందులో సితార కూడా ఉండటంతో పెద్ద హిట్ అయిపోయింది. అయితే సితార ఈ సినిమాలో కూడా కనిపిస్తుందా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి అప్పుడే పుకార్లు వస్తున్నాయి. సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా నందమూరి బాలకృష్ణ వస్తున్నారన్న వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవలే బాలకృష్ణ తో మహేష్ బాబు చర్చలు కూడా జరిపారని, అందులోనూ బాలకృష్ణ టాక్ షోలో మహేష్ బాబు కూడా పాల్గొనడంతో బాలకృష్ణ ఈ వేడుకకు హాజరు అవుతారని సమాచారం. నిజంగానే బాలకృష్ణ ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరై అయితే చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇది ఎంతవరకు నిజమో కొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది.