Nandamuri Balakrishna:అఖండ బాలయ్యతో దిల్ రాజు కాంబో..! డైరెక్టర్ అతనేనా?

Nandamuri Balakrishna:కరోనా తర్వాత అఖండ సినిమాతో తొలి ఘన విజయాన్ని సాధించారు నందమూరి బాలకృష్ణ. అఖండ తోనే కాకుండా అన్ స్టాప్అబుల్ టాక్ షో తో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాకు ఓకే చెప్పారు. అయితే బాలకృష్ణ ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అఖండ ఘనవిజయం తరువాత బాలకృష్ణ తో చాలామంది దర్శక నిర్మాతలు సినిమాలు తీయాలని భావిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరైన దిల్ రాజు నిర్మాతగా బాలకృష్ణ గారి తో ఒక సినిమా తీయాలని కోరిక కాగా, త్వరలో నే సినిమా నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి అని సమాచారం. దిల్ రాజు బాలకృష్ణ కాంబోలో వస్తున్న సినిమాకు బీవీఎస్ రవి డైరెక్టర్ గా పని చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రచయితగా బీవీఎస్ రవి ఇండస్ట్రీలో తనదైన గుర్తింపుని సంపాదించుకున్నారు. కానీ బీవీఎస్ రవి దర్శకత్వం వహించిన గోపీచంద్ హీరోగా వచ్చిన వాంటెడ్,సాయిధరమ్ తేజ జవాన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేదు.

అయితే బీవీఎస్ రవి ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కథ వినిపించినట్లు సమాచారం. ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో ఉన్న బాలకృష్ణ ఫ్లాప్ డైరెక్టర్ కు చాన్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి. డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దిల్ రాజు బాలకృష్ణ లా రేర్ కాంబినేషన్ సెట్ అయిపోయినట్టే.