భాష మనదైనా ఇతర భాషల సినిమా అయినా అది చిన్న హీరో ఉన్నా పెద్ద హీరో ఉన్నా కూడా సినిమా బాగుంటే మన టాలీవుడ్ జనం ఏ రేంజ్ లో సినిమా చూస్తారో మరో సారి గత వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన చిన్న సినిమా “బలగం” నిరూపించింది. కమెడియన్ వేణు యెల్దండి దర్శకుడు పైగా ప్రియదర్శి అనే చిన్న నటుడు కావ్య కళ్యాణ్ అనే అప్ కమింగ్ యంగ్ హీరోయిన్ లతో చేసిన ఓ చిన్న సినిమా ఇది.
పేరుకి దిల్ రాజు నిర్మాతే అని కానీ చాలా చాలా లిమిటెడ్ గానే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా 9వ రోజు బాక్సాఫీస్ దగ్గర చేసిన వసూళ్లు చూసి ఇప్పుడు ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి. ఈ సినిమాకి 9వ రోజు ఏకంగా మొదటి రోజు కన్నా భారీ మార్జిన్ లో సినిమా వసూళ్లు నమోదు చేసిందట.
దీనితో ఈ చిత్రం ఏకంగా 10 కోట్ల దగ్గర గ్రాస్ ని చేరుకుంది. చిన్న చినుకులా స్టార్ట్ అయ్యిన ఈ సినిమా వసూళ్లు ఇప్పుడు మహా ప్రవాహంలా మారాయి. దీనితో ఈ సినిమాకి ఆదరణ ఏ రేంజ్ లో దక్కుతుందో అర్ధం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా చూసి యూనిట్ ని అభినందించారు.
ఇలా మొత్తంగా అయితే ఈ చిన్న సినిమా సక్సెస్ పెద్ద ఎత్తున బాక్సాఫీస్ దగ్గర నిలిచి భారీ లాభాలను అందించడమే కాకుండా ఆడియెన్స్ కి కూడా తమ విలువలని చూపిస్తుంది. అయితే ఈ వసూళ్ళలో దాదాపు 60 శాతానికి పైగా నైజాం మార్కెట్ నుంచే రావడం విశేషం.