రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ 

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ హైప్ ఉన్న చిత్రాల్లో దర్శకుడు శంకర్ ఏకకాలంలో చేస్తున్న భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో ఒకటి ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “ఇండియన్ 2” ఒకటి కాగా ఈ చిత్రం తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా “గేమ్ చేంజర్” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం అయితే ఎప్పుడో స్టార్ట్ అయ్యింది కానీ షూటింగ్ మాత్రం అలా కొనసాగుతూనే వస్తుంది. నిజానికి ఎప్పుడో కంప్లీట్ అయిపోవాల్సిన ఈ చిత్రం ఎందుకో ఇంకా లేట్ అవుతుంది. కాగా ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో ఫ్యాన్స్ కి కాస్త ఎగ్జైట్ గా అనిపిస్తున్న అంశం ఏదన్నా ఉంది అంటే సినిమా చాలా బాగా షేప్ అవుట్ అవుతుంది మళ్ళీ శంకర్ మార్క్ సినిమా ఇది అని స్ట్రాంగ్ బజ్ ఉంది.

దీనితో మాత్రమే ప్రస్తుతానికి ఫ్యాన్స్ శాటిస్ఫై గా ఉండగా ఇక రిలీజ్ అయితే ఇప్పట్లో ఉండదని టాలీవుడ్ నుంచి కొన్ని ట్రస్టడ్ వర్గాలు చెప్తున్నాయి. ఎలా లేదన్నా చరణ్ అండ్ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఏడాది వెయిట్ చేయాల్సిందేనట. ఇది చాలా దూరమే అని చెప్పాలి. మరి మధ్యలో ఏమన్నా సమీకరణాలు అయితే మారుతాయో లేదో అనేది చూడాలి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా దిల్ రాజు భారీ వ్యయంతో సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.