అఫీషియల్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.!

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి ఒక గేమ్ ఛేంజింగ్ సబ్జెక్టగా వస్తున్నా భారీ చిత్రమే ప్రాజెక్ట్ కే ఇప్పుడు ఇదే చిత్రం “కల్కి 2898 ఏడి” గా మారింది. కాగా పాన్ ఇండియా రెబల్ స్టార్ [ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని దిగ్గజ నిర్మాత అశ్వని దత్ సుమారు 600 కోట్లకి పైగా బడ్జెట్ వెచ్చించి తెరకెక్కిస్తున్నారు.

ఐతే ఈ సినిమా నుంచి ఇప్పుడు వచ్చిన గ్లింప్స్ కి అయితే ప్రపంచ ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండగా ఈ చిత్రం కోసం అయితే ఇపుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆగలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ చిత్రం విషయంలో వారికి బ్యాడ్ న్యూస్ తగిలింది అని చెప్పి తీరాలి.

కాగా ఈ చిత్రాన్ని ఇది వరకే చిత్ర యూనిట్ 2024లో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా ఖరారు చేయగా లేటెస్ట్ గ్లింప్స్ లో అయితే డేట్ ని ఎక్కడా అనౌన్స్ చేయలేదు జస్ట్ 2024 రిలీజ్ అంటూ సంవత్సరం మాత్రమే పొందుపరిచారు. దీనితో ఈ చిత్రం సంక్రాంతి బరి లోనుండి తప్పుకున్నట్టే అని అఫీషియల్ అయ్యిపోయింది.

అయితే ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం రానున్న రోజుల్లో కన్ఫర్మ్ కావాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో దీపికా పదుకొనె అలాగే దిశా పటాని సహా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్గెస్ట్ ఫోర్స్ లు కీలక పాత్రలు చేస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.