శివగామి ఎత్తిన బాహుబలి: అప్పుడలా.. ఇప్పుడిలా..

bahubali kid

ఇండియన్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లలో ఒకటైన బాహుబలి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా సృష్టించిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఏ సీన్ కూడా ఆడియేన్స్ అంత ఈజీగా మర్చిపొరనే చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్ లో ఎమోషన్స్ మిక్స్ చేసి అమితంగా ఆకట్టుకున్నారు.
bahubali
ఇక అందరికి గుర్తిండిపోయే సన్నివేశాల్లో శివగామి ఏండింగ్ సీన్ ఒకటి. రమ్యకృష్ణ ఆ సీన్ లో ఎలా నటించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే అందులో పసికందుగా ఉన్న మహేంద్ర బాహుబలిని ఆమె ఒంటి చేత్తో పైకి ఎత్తిన సీన్ ఒక ట్రెండ్ సెట్ చేసింది. నెలలు నిండిన బుల్లి బాహుబలితో ప్రభాస్ కూడా అప్పట్లో ఫొటో దిగాడు.

అయితే ఆ పసి బాహుబలి అబ్బాయి కాదు. అమ్మాయి. తన పేరు తన్వి. సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ లో కూడా తనే కనిపించింది. ఆ ఫొటో అప్పట్లో సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు యూకేజీ చదువుతోంది. తన్వి గురించి తెలుసుకున్న వాళ్ళు ఆమెతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ అమ్మాయి బిగ్ స్క్రీన్ పై మళ్ళీ కనిపిస్తుందో లేదో చూడాలి.