Radhe Shyam: దాదాపు మూడు సంవత్సరాల వెయింటింగ్ తర్వాత భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఇటీవలే విడుదలైన సినిమా రాధే శ్యామ్. ఆల్మోస్ట్ 350 కోట్ల బడ్జెట్‌తో యంగ్ రెబల్ స్టార్ నటించిన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించారు. గోపీ కృష్ణ మూవీస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే మార్చి 11న ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది.
విధి రాత మరియు జాతకం నేపథ్యంలో వచ్చిన రాధే శ్యామ్ సినిమాపై ప్రారంభంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందనుకున్న ఈ చిత్రానికి విడుదలైన మొదటి రోజు నుంచే పలు విమర్శలు రావడం చర్చనీయాంశంగా మారింది. మల్టీపెక్స్ ఆడియెన్స్‌ను ఈ సినిమా మెప్పిస్తున్నప్పటికీ, మరో వర్గం ప్రేక్షకులు మాత్రం నిరాశకు గురవుతున్నట్టు సమాచారం. హస్తసాముద్రిక నిపుణుడిగా ఈ సినిమాలో ప్రభాస్ అలరించిన తీరు అభిమానులను మెప్పించినప్పటికీ, మరికొందరు మాత్రం ఆ కథాంశాన్ని తప్పు పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
అందులో భాగంగా ఇటీవల ప్రముఖ కాంట్రవర్శియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకునన రామ్ గోపాల్ వర్మ కూడా రాధే శ్యామ్ మూవీపై పలు కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు.. రెమ్యునరేషన్ విషయంలో ఓకే గానీ, ఆ సినిమాకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇదే తరహాలో ప్రముఖ సామాజిక కార్యకర్త బాబు గోగినేని కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు చెప్పేవన్నీ అబద్దాలేనని, బుద్ది ఉన్నోడు ఎవడన్నా ఇలా వాట్సాప్ మెసేజ్‌లు చూసి డైలాగ్‌లు రాస్తారా అని ఆయన ఆరోపించారు. సినిమా తుస్ అంటగా.. సినిమా తీసే ముందే విక్రమాదిత్యతో జాతకం చూపించుకోవాల్సింది అంటూ బాబు గోగినేని తన సెటైర్లతో రెచ్చిపోయారు. ఇకపోతే ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పలువురు ప్రేక్షకులు మాత్రం సినిమాను సినిమాలానే చూడాలని, అనవసరం రాద్దాంతం చేయరాదని వారు సూచిస్తున్నారు.