ఇదో తొక్కలో షో.. వామ్మో బాబా భాస్కర్ మామూలోడు కాదు!!

Baba Bhaskar In Adhirindi 25th Episode

బాబా భాస్కర్ అంటే ఎంటరైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్. ఆ విషయం తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసింది. కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌గా బాబా భాస్కర్ సక్సెస్ అయ్యాడు. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. కోపం, అసూయ, ద్వేషం వంటివి ఏవీ లేని మనిషిగా బాబా భాస్కర్‌కు తెలుగు ప్రేక్షకులు అభిమానులుగా మారారు. బిగ్‌బాస్ తరువాత మళ్లీ చాలా రోజుల తరువాత బుల్లితెరపై సందడి చేస్తున్నాడు బాబా.

Baba Bhaskar In Adhirindi 25th Episode
Baba Bhaskar In Adhirindi 25th Episode

ఆ మధ్య వినాయకచవితికి అదిరింది టీం చేసిన స్పెషల్ ఈవెంట్లో బాబా సందడి చేశాడు. బాపుబొమ్మకి పెళ్లంట అనే ఈవెంట్‌లో బాబా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక తాజాగా అదిరింది షోలోనూ పంచ్‌లతో దుమ్ములేపాడు. అదిరింది 25వ ఎసిపోడ్, మైలురాయి వంటివి కాబట్టి కాస్త భిన్నంగా ప్రయత్నించారు. అందుకే బాబాను గెస్ట్‌గా పిలిచారు.

అదిరింది షోలో ఎక్స్‌ప్రెస్ హరి స్కిట్‌లో బాబా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఢీ షోలాంటి వాటిపై తన స్కిట్‌ చేశాడు. ఆ స్కిట్‌లో జడ్జ్‌గా వ్యవహరించాడు బాబా. ఇక బాబా వేసిన పంచ్‌లకు ఎవ్వరికీ ఊపిరి ఆడలేదు. హరి, తన్మై, పండు ఇలా ప్రతీ ఒక్కరినీ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. చివర్లో ఇదో తొక్కలో షో నేను చేయను పోరా అంటూ స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి.. డైరెక్టర్ ప్రోమోకి ఓకేనా అంటూ అందర్నీ నవ్వించాడు. బాబాకు ఇలాంటి కాంట్రవర్సీ ట్రిక్కులు బాగానే వంటబట్టాయి.