డిఫరెంట్ థ్రిల్లర్ “సర్కిల్” సినిమా ట్రైలర్ విడుదల

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా “సర్కిల్”. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్ లో చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా

దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ – నా సినిమాల్లో నాయిక పాత్రలకు మంచి ప్రాధాన్యత ఇస్తాను. షో లో మంజుల, మిస్సమ్మలో లయ, భూమిక, సదా మీ సేవలో చిత్రంలో శ్రియా..ఇలా నా హీరోయిన్ల క్యారెక్టర్స్ బాగుంటాయని అంతా చెబుతారు. ఈ చిత్రంలోనూ ఆ ప్రయత్నాన్ని కొనసాగించాను. ఈ సినిమాలో అరుంధతి పాత్రలో రిచా పనై కనిపిస్తుంది. తనకు నచ్చిన లైఫ్ స్టైల్ లో జీవించే అమ్మాయి తను. స్వతంత్ర భావాలు గల యువతి. ఇప్పటిదాకా రిచా సాఫ్ట్ గర్ల్ క్యారెక్టర్స్ చేసింది. అయితే ఇందులో వైబ్రైంట్ క్యారెక్టర్ లో ఆమెను చూపిస్తే కొత్తగా ఉంటుందని అనిపించింది. అలాగే అశ్రిణ్ కూడా తొలిసారి తెలుగు సినిమా చేస్తున్నా, బాగా నటించింది. రాజసం మన పుట్టుకతో వస్తుందని చెప్పే పాత్ర తనది. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా నైనా కనిపిస్తుంది. సాయి రోనక్ తన కెరీర్ లో బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చాడు. బాబా భాస్కర్ ది కీలక పాత్ర. సర్కిల్ థ్రిల్లర్ జానర్ లో ఓ మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది. అన్నారు.

నటుడు బాబా భాస్కర్ మాట్లాడుతూ – మిగతా దర్శకులు నటుడిగా నన్ను ఒకలా చూస్తే…నీలకంఠ గారు నాలోని వైల్డ్ యాంగిల్ చూపిస్తున్నారు. నాతో ఈ చిత్రంలో కత్తి పట్టించారు. ఈ సినిమాలో నటించడం ఒక బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్. అందరు నటీనటులు బాగా చేశారు. మ్యూజిక్ బాగా వచ్చింది.

హీరో సాయి రోనక్ మాట్లాడుతూ – ఎవరి సపోర్ట్ లేకుండా ఇప్పటిదాకా కెరీర్ సాగిస్తున్నాను. ఈ సినిమాలో నటుడిగా నా బెస్ట్ ఇచ్చాను. దర్శకుడు నీలకంఠ గారితో పనిచేయడం గొప్ప ఎక్సీపిరియన్స్ గా భావిస్తున్నా. ఆయనతో వర్క్ చేయడం ఒక ఛాలెంజ్. అయితే సవాళ్లు స్వీకరిస్తేనే నటుడిగా ఎదుగుతాం. అలా ఈ సినిమా షూటింగ్ ప్రతి రోజూ ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ముగ్గురు నాయికలు ఉన్నారు. వారికి డిఫరెంట్ రోల్స్ ఇచ్చారు. అలాగే నా యాంటీ హీరో బాబా భాస్కర్. నిజానికి ఈ చిత్రంలో నాతో పాటు తను కూడా ఒక హీరోనే. మేమిద్దరం షూటింగ్ టైమ్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఒక మంచి చిత్రమిది మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ రిచా పనై మాట్లాడుతూ – నీలకంఠ గారు కథ చెప్పినప్పుడు ఇందులోని ప్రిన్సెస్ రోల్ ఇస్తారని ఆశించా. కానీ అరుంధరి పాత్రకు ఎంచుకున్నాను. ఈ అవకాశం నాకు చాలా ప్రత్యేకంగా భావిస్తున్నా. దర్శకుడితో పాటు నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నా. జూలై 7న మా సినిమాను థియేటర్ లో చూడండి. అని చెప్పింది

హీరోయిన్ అర్షిణ్ మెహతా మాట్లాడుతూ – నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. తెలుగు సినిమాలు చూస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఈ ఇండస్ట్రీలో అడుగుపెడతానా అని అనుకునేదాన్ని. సర్కిల్ సినిమాతో నాకు టాలీవుడ్ లోకి వచ్చే అవకాశం దక్కింది. ఈ సినిమాలో నటించేందుకు సపోర్ట్ చేసిన ప్రతి టీమ్ మెంబర్ కు థాంక్స్. అని చెప్పింది.

నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ – కథ విన్నప్పటి నుంచి ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుందని నమ్మాం. అదే నమ్మకంతో సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. జూలై 7న మీ ముందుకు వస్తోంది. చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.