ఆర్ఆర్ఆర్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల ప్రహసనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులని కూడా పలు విభాగాలలో సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాలలో ఆర్ఆర్ఆర్ చిత్రం అవార్డులని సొంతం చేసుకుంది. నిజంగా మన తెలుగు సినిమాకి ఈ అవార్డులు దక్కడం గర్వకారణం అని చెప్పాలి.
ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అసలు అవార్డులకె అర్హత లేదని ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ ని నామినేషన్ చేయలేదు. అయితే రాజమౌళి మాత్రం ఇండిపెండెంట్ కేటగిరీలో అంతర్జాతీయ అవార్డులకి ఆర్ఆర్ఆర్ సినిమాని పంపించారు. ఈ నిర్ణయం ఎంత గొప్పదో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న అవార్డులు చూస్తుంటేనే అర్ధం అవుతుంది. ఇక ఈ అవార్డుల వేడుకకి రాజమౌళి, ఎంఎం కీరవాణి, రామ్ చరణ్, `సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళి తనయుడు కార్తికేయ హాజరయ్యి అవార్డులని తీసుకున్నారు.
ఇక ఈ అవార్డుల వేడుకలో భాగంగా బెస్ట్ స్టంట్ డైరెక్టర్స్, బెస్ట్ యాక్షన్ మూవీ అవార్డులని రాజమౌళి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకి పనిచేసిన హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కి థాంక్స్ చెప్పారు. హాలీవుడ్ నుంచి వచ్చిన కూడా తమ నేటివిటీని అర్ధం చేసుకొని, తాను కోరుకున్న విధంగా వారు యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేసి ఇచ్చారు. ఇప్పటి వరకు ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ సీక్వెన్స్ ఎ సినిమాలో కూడా రాలేదు.
అయితే మొదటిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో హీరోలు ఇద్దరు కలినిపిస్తారు. ఇక ఈ అవార్డులు తమ చిత్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ఇదిలా ఉంటే ఈ వేడుకలో రాజమౌళి నిర్మాత పేరుని ఎక్కడ ప్రస్తావించలేదు. నిజానికి బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులని నిర్మాతగా దానయ్య తీసుకోవాలి. అయితే ఈ అవార్డులల వేడుకకి ఆయన హాజరుకాలేదు. అలాగే రాజమౌళి కూడా దానయ్య పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.