తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. బుల్లితెర వీక్షకుల్ని బిగ్‌బాస్ మరో రెండు వారాలు మాత్రమే ఎంటర్‌టైన్ చేయనున్నారు. ఇక ఈ వీకెండ్ శనివారం ఎపిసోడ్‌కు వస్తే.. హోస్ట్ నాగార్జున వస్తే ఎవరిని టార్గెట్ చేస్తాడో అని అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురు చూశారు. అయితే అందుకు భిన్నంగా ఈ శనివారం నాగార్జున ఎవరికీ క్లాస్ పీకలేదు. దీంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకోగా, చూసేవాళ్ళకి మాత్రం చప్పగా అనిపించింది.
ఇక ఈ వారం ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం కచ్ఛితంగా ఒకరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉన్న నేపధ్యంలో, ఎక్కువ మంది మోనాల్ ఈసారి గ్యారెంటీగా వెళుతుందని అభిప్రాయ పడ్డారు. అయితే శనివారం ఎపిసోడ్ చూశాక బిగ్‌బాస్ దత్తపుత్రిక మరోసారి ఎలిమినేషన్స్ నుండి సేఫ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో గతవారం ఎవిక్షన్ పాస్‌తో గట్టెక్కిన అవినాష్ ఎలిమినేట్ అవనున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.
అసలుఈ వారం నామినేషన్స్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌లో అభిజిత్, అఖిల్, హారిక, ఓటింగ్ పరంగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో పోటీపడుతూ.. అవినాష్ అండ్ మోనాల్ ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా హౌస్‌లో అవినాష్ ప్రవర్తిస్తున్న తీరుకు అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారనే చెప్పాలి. ఎంటర్‌టైన్ చేయడంలో ముందుండే అవినాష్ సింపథీ గేమ్ పై ఫోకస్ పెట్టడం అవినాష్ కొంపముంచిదని చెప్పొచ్చు.
ఇక లాస్ట్ వీక్ కూడా ఎవిక్షన్ పాస్‌తో సేవ్ అయ్యానని అనవసరంగా చర్చలు జరపడం, రేస్ టు ఫినాలే టాస్క్‌లో ఓవర్‌గా రియాక్ట్ అయ్యి గేమ్‌ను మద్యలోనే ఆపేయడం, తరచూ తొటి హౌస్‌మేట్స్ పై ఫస్ట్రేట్ అవడం అవినాష్‌కు ప్రతికూలంగా మారాయి. ఈ క్రమంలో హౌస్‌లో ఉన్న అందరికంటే అవినాష్‌కే తక్కువ ఓట్లు వచ్చాయని టాక్. దీంతో ఈ వారం బిగ్‌బాస్ దత్తపుత్రిక మోనాల్ మరోసారి సేఫ్ అవడం గ్యారెంటీ అని, జోకర్ అవినాష్ కథ ఇక్కడితో ముగుస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే చివరిలో బిగ్‌బాస్ ఎమైనా ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి.