Avinash: చేతిలో చిల్లిగవ్వ లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా… ఎమోషనల్ అయిన అవినాష్!

Avinash: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలోఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా పరిచయమైన ముక్కు అవినాష్ కూడా తన కామెడీతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు . ముక్కు అవినాష్ కి జబర్దస్త్ ద్వారా మాత్రమే కాకుండాబిగ్ బాస్ రియాలిటీ షో వల్ల కూడా మంచి గుర్తింపు లభించింది. బిగ్ బాస్ రియాలిటీ షో లో పాటిస్పేట్ చేయడానికి ముందు మల్లెమాల వారితో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం అవినాష్ 10 లక్షల రూపాయల డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో అవినాష్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు.

కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్న అవినాష్ భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. మా టీవీలో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ జోడీ2 ప్రోగ్రామ్ లో భార్యతో కలసి పాటిస్పేట్ చేశాడు. ఈ ప్రోగ్రాం కి ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ఒకటి ఇటీవల విడుదలయ్యింది.
ఈ ప్రోమోలో ఓంకార్ అవినాష్ గురించి మాట్లాడుతూ ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కామెడీ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రతి రూపాయి కూడపెట్టుకుని ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉన్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని ఓంకార్ అంటాడు.

ఓంకార్ మాటలు విన్న అవినాష్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అమ్మానాన్నలకు ఆపరేషన్ చేయించి, ఇల్లు కట్టుకున్న సమయంలో లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అని అవినాష్ వెల్లడించారు. అందర్నీ నవ్వించాలి అంటే ముందు మనల్ని మనం జోకర్ గా చూసుకోవాలి, నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా అవన్నీ తట్టుకుని నిలబడిన నువ్వు రియల్లీ గ్రేట్ అని ఓంకార్ అవినాష్ ని మెచ్చుకున్నారు.