Avinash: జబర్దస్త్ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్ అవినాష్. ముక్కు అవినాష్ పేరుతో కొంతకాలం బుల్లి తెర అభిమానులను అలరించినా, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షో నిర్వాహకులకు దాదాపు రూ.10 లక్షలు కట్టి ఆ షో నుంచి బయటకు వచ్చాడు అవినాష్.
గత రెండు సంవత్సరాలుగా యావత్ దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం ఎంతో మంది కళాకారుల జీవితాలను సైతం చిద్రం చేసిన విషయం తెలిసిందే. అందులో అవినాష్ కూడా ఉండడం బాధాకరమైన విషయం. ఆ సమయంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డానని ఇటీవల అవినాషే స్వయంగా ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఇస్మార్ట్ జోడీ 2 అనే షోలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈ షోకు వ్యాఖ్యాతగా ఓంకార్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సైనీ పరిశ్రమలోకి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి, ఒక్కో రూపాయి సంపాదించి ఈరోజు ఇల్లు కట్టుకొని, తన సొంత కాళ్లపై నిలబడ్డాడని, అందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని ఓంకార్, అవినాష్ ని కొనియాడాడు.
ఆ మాటలకు అవినాష్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎదుటి వారిని నవ్వించే క్రమంలో మనల్ని మనం జోకర్ గా చూసుకోవాలని, నెగటివ్ కామెంట్స్ వచ్చినా ఓర్చుకొని, ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డ అవినాష్ రియల్లీ గ్రేట్ అంటూ ఓంకార్ అన్నారు.
అదే సమయంలో అమ్మా, నాన్నలకు ఆపరేషన్ చేయించానని, ఇల్లు కూడా కట్టుకొని అకస్మాత్తుగా జీరోకి వెళ్లానని అవినాష్ వాపోయాడు. ఆ టైంలో ఎవరైతే నా అనుకున్నానో, వాళ్ళే సాయం చేయమని చెప్పారని తెలిపారు. అందరికీ తెలియని ఇంకో విషయం ఏమిటంటే లాక్ డౌన్ సమయంలో తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాను అంటూ అవినాష్ చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ స్టార్ మా తోనే తనకు సక్సెస్ వచ్చిందని, స్టార్ మా కు తానెప్పుడూ రుణపడి ఉంటానని అవినాష్ స్పష్టం చేశారు.