Hyper Aadi: జబర్దస్త్ లో హైపర్ ఆదిని కోరుకుంటున్న ప్రేక్షకులు… ఆది లేని షో చూడలేము?

Hyper Aadi: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరికొంతమంది మాత్రం తమ టాలెంట్ తో కమెడియన్లు గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అటువంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు. మొదట అదిరే అభి టీం లో కంటెస్టెంట్ గా వచ్చిన హైపర్ ఆది తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. గురువారం వచ్చేసరికి ప్రేక్షకులందరూ ఆది స్కిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి క్రేజ్ ఉన్న అది మాత్రం గత నాలుగైదు వారాలుగా జబర్దస్త్ లో కనిపించడం లేదు.

దీంతో ప్రేక్షకులు అందరూ అది ఎప్పుడు తిరిగి స్కిట్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఆది ఇలా జబర్దస్త్ లో కనిపించకుండా ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల షో లలో సందడి చేస్తుండటంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరైతే రెమ్యూనరేషన్ విషయంలో మల్లెమాల వారితో వచ్చిన బేదాభిప్రాయాలు కారణంగా ఆది జబర్దస్త్ కి రాకుండా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొందరు మాత్రం ఇలా రెమ్యునరేషన్ విషయంలో భేదాభిప్రాయాలు వస్తే 3 షో లకి రాకుండా ఉండాలి. అల కాకుండా జబర్దస్త్ కి మాత్రమే ఎందుకు రావటం లేదు అనుమాన పడుతున్నారు.

గత నాలుగైదు వారాలుగా వస్తున్న ఈ అనుమానాలు అన్నింటికీ ఇప్పటివరకు సమాధానం లభించలేదు. ఈ విషయం గురించి అది కూడా ఎక్కడ స్పందించలేదు. ఆది తిరిగి జబర్దస్త్ కి వస్తాడా రాడా అనే సందేహం మాత్రం అభిమానుల్లో అలాగే ఉంది. ఆది జబర్దస్త్ కి రాకపోవటంతో జబర్దస్త్ రేటింగ్స్ కూడా పడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆది స్కిట్ లేకపోతే జబర్దస్త్ చూడటానికి చాలా మంచి ఆసక్తి చూపటం లేదు.