షాకింగ్ : “జవాన్” డైరెక్టర్ కి హాలీవుడ్ నుంచి కాల్ అట 

ఇప్పుడు తమిళ సినిమా సహా హిందీ సినిమా దగ్గర కూడా గట్టిగా వినిపిస్తున్న సినిమా పేరు “జవాన్” కాగా దర్శకుడు అయితే అట్లీ అని చెప్పాలి. తమిళ్ లో ఎన్నో భారీ హిట్స్ ఇచ్చిన తాను ఇప్పుడు హిందీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా “జవాన్” తో వెళ్ళాడు.

అయితే ఈ సినిమా విషయంలో వీళ్ళు చేస్తున్న అతి కానీ కామెంట్స్ కానీ సినిమా కంటే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని ఆస్కార్ కి పంపుతామని మొదట కామెంట్స్ చేయగా అసలు ఈ సినిమాకి అంత రేంజ్ కానీ సినిమాలో ఆ రేంజ్ కంటెంట్ కూడా లేదు అని అందరికీ తెలుసు.

జస్ట్ షారుఖ్ మాస్ అపీల్ అట్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల ఇలా ఆడుతుంది. ఇదే హైలైట్ అనుకుంటే ఇప్పుడు అట్లీ ఇంకో షాకిచ్చాడు. జవాన్ సినిమా తర్వాత అయితే తనకి హాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది అని తాను చెప్పినట్టుగా సినీ వర్గాల్లో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ మాట స్వయంగా అట్లీనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పడాని అంటున్నారు.

తనకి జవాన్ సినిమా చూసిన తర్వాత ఓ హాలీవుడ్ సంస్థ కాల్ చేసి సినిమా చేయాలని కోరారు అని చెప్పాడట. దీనితో ఈ స్టేట్మెంట్ విన్న వాళ్ళు షాకవుతున్నారు. అసలు జవాన్ లో అంతలా ఏముంది? పెద్ద గొప్ప కథ కూడా కాదు నిజంగానే అట్లీకి కాల్ వచ్చిందా లేక తాను అలా చెప్పుకుంటున్నాడా అని అంటున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు అట్లీ అన్నట్టుగా ఈ మాట సినీ వర్గాల్లో గట్టిగానే వైరల్ గా మారింది.