లేటు వయస్సులో వీరికి నిజమైన ప్రేమ దొరికిందంట

విదేశాలలో లేటు వయస్సులో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న సెలబ్రిటీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇండియాలో కూడా ఈ మధ్య అలాంటి వారి జాబితా పెరుగుతోంది. ప్రేమకి వయస్సుతో సంబంధం లేదని ఈ జంటలు ప్రూవ్ చేస్తున్నాయి. నిజమైన ప్రేమ జీవితంలో ఏ వయస్సులో అయిన దొరకొచ్చు. దానిని ఆశ్వాదించడం ముఖ్యం అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం సౌత్ ఇండియాలో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటుడు ఆశిష్ విద్యార్ధి 60 ఏళ్ళ వయస్సులో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య రాజోషికి 2021లో ఆయన విడాకులు ఇచ్చేశారు. రెండేళ్ళు తిరక్కుండానే రుపాలీ బారుఫా అనే మహిళని వివాహం చేసుకున్నాడు.

బాలీవుడ్ లో హీరోగా విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న కబీర్ బేడీ 70 ఏళ్ళ వయస్సులో పర్వీన్ దుసాని ఆమె వ్యాపారవేత్తని నాలుగో పెళ్లి చేసుకున్నాడు. 2016లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన వెటరన్ స్టార్ నీనా గుప్తా 54 ఏళ్ళ వయస్సులో వివేక్ మెహ్రాని వివాహం చేసుకుంది.

ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఊర్మిళ మాతోండ్కర్ 42 ఏళ్ళ వయస్సులో మోసిన్ అక్తర్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లికి ముందు చాలా మంది బాలీవుడ్ స్టార్స్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్న తర్వాత ఫైనల్ గా తనకి పెర్ఫెక్ట్ పార్ట్ నర్ ని సెలక్ట్ చేసుకుంది. ఇలా వీరందరూ కూడా లేట్ వయస్సులో వారి లైఫ్ లో నిజమైన ప్రేమని అందించే జీవిత భాగస్వామిని సొంతం చేసుకున్నారు.

వీరు మాత్రమే కాకుండా మిగిలిన ఇండస్ట్రీలో కూడా చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ తో పాటు, రాజకీయ రంగంలో ఉన్న వారు కూడా లేటు వయస్సులో తమకంటే వయస్సులో చాలా చిన్నవారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.