ఫ్యామిలీతో కలిసి రానా నాయుడు చూడొద్దట!

రియల్ లైఫ్ బాబాయ్, అబ్బాయ్‌లు వెంకటేశ్‌, రానా రీల్ లైఫ్‌లో తండ్రి కొడుకులుగా నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. ఈ ఇద్దరు ఈ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా మార్చి 10వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ వెబ్ సిరీస్ గురించి నెట్ ఫ్లిక్స్ సంస్థ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ‘రానా నాయుడు’ టీమ్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఈ వెబ్ సిరీస్ ఒక తండ్రి కొడుకుల యుద్ధం అని దాదాపుగా అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ గురించి తెలుగు మీడియాతో ముచ్చటించింది వెబ్ సిరీస్ టీం. అయితే ఈ సందర్భంగా రానా దగ్గుబాటి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

రానా ఏం అన్నారంటే… ”విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ టికెట్లు కొని సంక్రాంతి పండుగ సెలవులకు వెళ్ళినట్టు వెళ్తారు. కానీ ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడకండి… విడి విడిగా చూడండి.. కలిసి చూస్తే కంగారు పడతారు” అంటూ రానా కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇక వెబ్ సిరీస్ ట్రైలర్‌లో చూపించిన దాని ప్రకారం ఈ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి లాంటి స్టార్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. పాపులర్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్‌కు ఇండియన్ అడాప్షన్‌గా దీన్ని నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేస్తోంది. ఇక ఈ ఇండియా వెర్షన్‌ని కరణ్ అన్షుమాన్ పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ కలసి దర్శకత్వం వహించారు. రానా మాటలను బట్టి బోల్డ్ కంటెంట్ తో పాటు హింసాత్మక సన్నివేశాలు కూడా గట్టిగానే ఉన్నట్లు ఉన్నాయి మరి. ఇంతకీ అందులో ఏముందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సింది.