నీతులు, సూక్తులు చెప్పడం తప్పే కాదు. అయితే అవి చెప్పే పద్దతి కూడా ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా అవి చెప్పే మనుషులను బట్టి కూడా ఉంటుంది. తాజాగా ఓ హాట్ బ్యూటీ సిగరెట్ తాగుతూ నీతులు చెప్పింది. నేను దమ్ముకొడుతున్నానని బాధపడకండి.. మీరు మీరు కార్లు, బైకులు, ఫ్యాక్టరీలతో ప్రకృతిని కాల్చినప్పుడు అది కూడా ఇలాగే ఫీల్ అవుతుందని లెక్చర్ ఇచ్చింది. అయితే దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
`నాటకం` సినిమాతో ఎంట్రీ ఇచ్చి జెస్సీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అషీమా నర్వాల్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారకు నిత్యం మెంటల్ ఎక్కిస్తూ ఉంటుంది. తాజాగా దమ్ముకొడుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో బాలయ్య డైలాగ్ చెబుతూ రెచ్చిపోయింది. శ్రీమన్నారయణ సినిమాలోని ట్రబుల్ డైలాగ్‌ను చెప్పి నీతులు వల్లించింది.
”డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ .. ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐయామ్ నాట్ ద ట్రబుల్ అంటూ మస్త్ యాటిట్యూడ్ చూపించింది. ఆ తరువాత సిగరెట్ తాగుతు స్టైల్‌గా పొగను వదిలింది. మీరు కూడా కాలుష్యాన్ని ఇలా కాల్చేస్తున్నారని నీతులు చెబుతూ పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో, పోస్ట్‌పై నెటిజన్లు భగ్గు మంటున్నారు. ఇలాంటివి పోస్ట్ చేసే ముందు కాస్త ఆలోచించాలి, సిగ్గులేదా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.