మొత్తానికి అక్కినేని వారసుడి వివాహం అయినవాళ్ళ మధ్య సంబరంగా జరిగిపోయింది. ఎన్నాళ్ళ నుంచో ఈ పెళ్లి పనులలో బిజీగా ఉన్న నాగచైతన్య ఇక కెరియర్ పై దృష్టి పెట్టాలి అన్నట్టు వరస సినిమాలను సైనప్ చేస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే విరూపాక్ష సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేయటానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజ హెగ్డే ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కెరియర్, వివాహం గురించి పక్కన పెడితే ఇప్పుడు నాగచైతన్యకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక హీరోయిన్ నాగచైతన్యతో అమ్మగా, భార్యగా, ఫ్రెండ్ గా నటించింది. ఆమె ఎవరు మీకేమైనా అర్థమైందా.. ఆమె మరెవరో కాదు లావణ్య త్రిపాఠి. నాగచైతన్య, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి మూడు సినిమాలు చేశారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున సరసన నటించింది లావణ్య త్రిపాఠి.
ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కింది. ఆ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాడు అతనికి తల్లిగా కనిపించింది లావణ్య త్రిపాఠి. అలాగే మనం సినిమాలో నాగచైతన్యకు ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తుంది లావణ్య త్రిపాఠి. ఇక నాగచైతన్య కి ప్రియురాలిగా ఆమె యుద్ధం శరణం సినిమాలో కనిపించింది.
ఈ జనరేషన్లో ఒక నటుడితో ఇన్ని పాత్రలలో కనిపించడం నిజంగా గ్రేట్. ఇక నాగచైతన్య కెరియర్ విషయానికి వస్తే ఆయన ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించారు కానీ సక్సెస్ అయిన సినిమాలు చాలా తక్కువ. ఒకటి, రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ అవి కథ పరంగానో లేదంటే హీరోయిన్ పరంగానో హిట్ అయినవే అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వారు. శోభితతో పెళ్లి అయిన వేళా విశేషం వలన అయినా అతని కెరియర్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.