టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో సురేఖా వాణిది ప్రత్యేక శైలి. కామెడీ పాత్రలైనా, ఏడిపించే క్యారెక్టర్స్ అయినా సురేఖా వాణి తనదైన శైలిలో పండిస్తుంది. అయితే తెరపై చూసే సురేఖా వాణికి, నిజ జీవితంలో మనం చూసే సురేఖా వాణికి ఎంతో తేడా ఉంటుంది. మోడ్రన్ మదర్‌గా తన కూతురు సుప్రితతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.
సురేఖా వాణి తన కూతురితో కలిసి చేసే టిక్ టాక్ వీడియోలు ఎంతగా హల్చల్ చేసేవో అందరికీ తెలిసిందే. కళ్లజోడు, పంచెకట్టులో తల్లీకూతుళ్లు చేసిన వీడియోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. ప్రస్తుతం ఈ తల్లీ కూతుళ్లు రాజస్థాన్‌లో ఉన్నారు. విజయ్ సేతుపతి, రాధిక, రాజేంద్ర ప్రసాద్ వంటి తారాగణంతో తెరకెక్కిస్తోన్న మూవీ షూటింగ్ కోసం జైపూర్ వెళ్లింది. పనిలోపనిగా తన కూతుర్ని కూడా తీసుకెళ్లింది.
ఇద్దరూ కలిసి అక్కడ అజ్మీర్ దర్గాను కూడా దర్శించుకున్నారు. ఇక షూటింగ్ గ్యాప్‌లో సురేఖా వాణి ఆవిరి పీల్చుకుంటూ బిజీబిజీగా గడిపేస్తోంది. అసలే ఇది కరోనా సమయం కదా. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మేలు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది.. అని చెబుతూ.. తనకేమీ కాలేదు.. కరోనా రాలేదు.. అంటూ సురేఖా వాణి క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి సురేఖా వాణి కరోనా రాకుండా జాగ్రత్తలు బాగానే తీసుకుంటోంది.