నటి సురేఖా వాణి కామెడీని, ఎమోషన్ని తనదైన శైలిలో పండిస్తుంది. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాల్లో సురేఖ చేసే కామెడీ ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ పాత్రల్లోనూ అంతే స్థాయిలో నటించి రక్తి కట్టిస్తుంది. అయితే తెరపై చూసే సురేఖా వాణి వేరు బయట ఉంటే సురేఖా వాణి వేరు. యంగ్ అండ్ మోడ్రన్ మదర్‌లా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. కూతురు సుప్రితతో పోటీ పడి మరీ రెడీ అవుతుంది.
ఇక తనెత్తు కూతురు ఉన్నా గానీ సురేఖా వాణి గ్లామర్ గానీ అందం గానీ ఏ మాత్రం తగ్గలేదు. ఆ మధ్య టిక్ టాక్‌లో తల్లీ కూతుళ్లు చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి చేసిన వీడియోలు, డ్యాన్సులు ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. పంచెలు కట్టుకుని కళ్లజోడు పెట్టుకుని చేసిన వీడియో మాత్రం రచ్చ రచ్చ చేసింది. పేరుకు తల్లీ కూతుళ్లమే అయినా ఫ్రెండ్స్‌లా ఉంటామని, ఇద్దరం కలిసి వెకెషన్లకు వెళ్తామని చెప్పుకొచ్చేది. ఇద్దరూ నిత్యం విదేశాల్లో ఎంజాయ్ చేసి వస్తారు. ప్రస్తుతం కరోనా కాలం కాబట్టి.. ఇంటి పట్టునే ఉంటున్నారు.
అయితే ఈ మధ్యే షూటింగ్‌లు మొదలవ్వడంతో కాస్త బిజీగా అయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సురేఖా వాణి జైపూర్ వెళ్లింది. అక్కడ ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ కీ రోల్ పోషిస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి సురేఖ ఓ ఫోటోను షేర్ చేసింది. చీరకట్టులో సన్నజాజిలా మారిపోయింది. యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా మల్లెతీగలా మారిపోయింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.