Arjun Ambati: ఇండస్ట్రీలో అడుక్కున్నా కష్టమే…. బుచ్చి బాబుకు జీవితాంతం రుణపడి ఉంటా: అర్జున్ అంబటి

Arjun Ambati: బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అర్జున్ అంబటి ఒకరు. ఎన్నో బుల్లితెర సీరియల్స్ అలాగే ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కూడా ఈయన కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి కాగానే ఈయన తిరిగి తన సీరియల్స్ లో బిజీగా మారిపోయారు అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో ఉండగానే ఈయనకు ఏకంగా రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సుమారు 400 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమాలో తనకు అవకాశం ఉంటుంది అంటూ బుచ్చిబాబు బిగ్ బాస్ వేదికపై నుంచి అర్జున్ కి తెలియజేశారు.

ఇక ఈ విషయం విన్న అర్జున్ ఎగరీ గంతేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో అర్జున్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇలా ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ఈ సినిమా అవకాశం రావడం గురించి ఈయన మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం రావాలి అంటే దర్శక నిర్మాతలను ఎంత అడుక్కున్నా కష్టమే ఆ పాత్రలో మనకు అవకాశం వస్తుందా రాదా అనేది తెలియదు.

అలాంటిది నాకు డైరెక్టర్ పిలిచి మరి అవకాశం ఇవ్వడం నిజంగా ఎంతో గొప్ప విషయమని నా జీవితాంతం బుచ్చిబాబు అన్నకు రుణపడి ఉంటాను అంటూ అర్జున్ అంబటి ఈ సందర్భంగా బుచ్చిబాబు గురించి తనకు రామ్ చరణ్ సినిమాలో అవకాశం కల్పించడం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.