తండ్రికి ఛాలెంజ్ విసిరిన అర్హ… కూతురి చేతిలో ఓడిపోయిన ఐకాన్ స్టార్?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి మనకు తెలిసిందే. ఈయన సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయం దొరికిన తన పిల్లలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కూతురు కొడుకుతో కలిసి సరదాగా గడిపిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇలా అల్లు అర్జున్ ఆయన సతీమణి పిల్లల గురించి నిత్యం సోషల్ మీడియాలో తెలియచేయడంతో ఈ పిల్లలకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ గురించి చెప్పాల్సిన పనిలేదు. అర్హ తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ తండ్రి కూతుర్ల మధ్య జరిగిన ఓ చిన్నపాటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా అర్హత తన తండ్రికి ఛాలెంజ్ చేయగా అల్లు అర్జున్ ఓడిపోవడం అందరిని ఆకట్టుకుంది.ఇలా కూతురి చేతిలో సరదాగా ఓడిపోయిన అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో భాగంగా అర్హ తన తండ్రిని పొడుపు కథ అడిగారు. గంగిగోవు పాలు గరిటడైన చాలు అంటూ పొడుపు కథ అడగగా అల్లు అర్జున్ జున్ను అంటూ సమాధానం చెబుతారు. అలాగే అర్హ తన తండ్రికి ఛాలెంజ్ విసిరారు. ఏడు నల్ల లారీలు, 7 ఎర్ర లారీలు అని చాలా ఫాస్ట్ గా చెప్పాలి అంటూ తన తండ్రికి ఛాలెంజ్ విసిరింది. అయితే అల్లు అర్జున్ ఇలా పలకలేక ఓడిపోవడమే కాకుండా ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ తండ్రి కూతుర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.