హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం సీతారామం. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సీతారామం స్వరాలు పేరుతో ఒక మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు హీరోలు హాజరయ్యారు. వీరిలో టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ మాళవిక నాయర్ వంటి వారు కూడా హాజరయ్యారు.
ఇకపోతే సంతోష్ శోభన్ వేదికపై మాట్లాడుతూ తెలుగులో ఎంతోమంది హీరోలు ఉండగా ఎవరు లేరన్నట్టు మలయాళం నుంచి హీరోలను పిలిపించుకొని సినిమాలు చేయటం అవసరమా? మేము ఉన్నాం కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలా సంతోష్ శోభన్ ప్రశ్నించడంతో చాలామందిలో ఇది నిజమే కదా అనే భావన కలిగిందని చెప్పాలి.ఇక నేను అడిగే మూడు ప్రశ్నలకు దుల్కర్ సరైన సమాధానాలు చెబితే ఆయన కూడా తెలుగు హీరో అని ఒప్పుకుంటాను అంటూ ప్రశ్నలు అడిగారు.
ఈ విధంగా సంతోష్ అడిగిన ప్రశ్నలకు దుల్కర్ సరైన సమాధానాలు చెప్పడంతో ఆయన మాట మాట్లాడకుండా వెనుతిరిగి పోయారు.అయితే ఇదంతా చూస్తున్న అభిమానులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు వెంటనే సుమ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఇది ఒక ఫ్రాంక్ స్టంట్ అని చెప్పడమే కాకుండా ఈ సంఘటన జరగడానికి ముందు వారు మాట్లాడుకున్న వీడియోని ప్లే చేయడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పువ్వులు పూసాయి. ఫ్రాంక్ అయినప్పటికీ సంతోష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అందరిని ఆలోచింపజేశాయి.