Anushka Shetty: మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో సోషల్ మీడియాలో మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ ఎన్నో పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే సాధారణ మహిళల నుంచి రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులకు సైతం మహిళా దినోత్సవ శుభాకాంక్షలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్ట్ లు చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీలో అరుంధతిగా, దేవసేనగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటారు.
అలాంటి అనుష్క శెట్టి మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పోస్ట్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సందర్భంగా అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రతీ ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రొఫెషనల్, ఫిజికల్, మెంటల్, సోల్ ఫుల్లీ అందరూ బెస్ట్ ఉండేందుకు ప్రయత్నించాలి.. గతాన్ని మరిచిపోయి ఉన్న కొద్దిపాటి జీవితంలో ఎంతో సంతోషంగా గడపడం కోసం ప్రయత్నించాలి అంటూ చెప్పుకొచ్చారు.
ఒక మహిళ విషయంలో ఒక తండ్రిగా, సోదరుడిగా, ఫ్రెండ్ గా, భర్తగా ఎన్నోరకాల ప్రేమను పంచుతూ మమ్మల్ని గుర్తించి ప్రేమను పంచడం వంటివి చేస్తున్న మగాళ్ళ అందరికీ థాంక్స్ అంటూ అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా అనుష్క శెట్టి చేసే ఏ పని అయినా కూడా ఎంతో స్వీట్ గా ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు.నిశ్శబ్దం సినిమా తర్వాత పూర్తిగా తెలుగు తెరకు దూరమైన అనుష్క తాజాగా రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.