ఆదిపురుష్ లో అనుష్క శెట్టి .. ఇంతకన్నా క్లారిటీ ఏంకావాలి ..?

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తో సినిమా అంటే కనీసం 300 – 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా ప్రభాస్ నటించబోతున్న “ఆదిపురుష్” రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దాదాపు 750 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కి సంబంధించిన ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించబోతున్నాడని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే క్లారిటీ ఇచ్చారు. దాంతో అప్పటి నుంచి ఈ ఆదిపురుష్ లో ప్రభాస్ కి జంటగా అత్యంత ప్రధానమైన సీత పాత్రలో ఏ స్టార్ హీరోయిన్ నటిస్తుందని అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలువురి స్టార్ హీరోయిన్స్ పేర్లు ప్రచారంలో నిలుస్తున్నాయి. ముందు నుంచి ఈ సినిమాలో సీతగా కీర్తి సురేష్, కియారా అద్వాని పేర్లు జోరుగా ప్రచారం జరిగాయి. అలాగే పూజా హెగ్డే పేరు కూడా తెరపైకి వచ్చింది.

అయితే ఈ మధ్య ప్రభాస్ కి జంటగా మరోసారి అనుష్క నటించబోతుందని అది కూడా ఆదిపురుష్ లో సీత పాత్రలో అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. దాంతో అందరూ నిజమేనని దాదాపుగా నమ్మేశారు కూడా. కాని ఇదంతా కేవలం పుకారు మాత్రమే అంటూ అనుష్క శెట్టి తాజాగా క్లారిటి ఇచ్చింది.

అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైం లో స్ట్రీమిగ్ కాబోతుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్ అనుష్క కి జంటగా నటించాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క కి ఆదిపురుష్ లో ప్రభాస్ కి జంటగా సీత పాత్రలో నటిస్తున్నారట ..? అన్న ప్రశ్న ఎదురవగా .. సింపుల్ గా లేదంటూ కొట్టిపారేసింది. ఇప్పటి వరకు అలాంటి ప్రపోజల్ ఏమీ రాలేదని ఇవన్ని కేవలం గాసిప్స్ అంటూ తేల్చేసింది అనుష్క.