వామ్మో బరువు తగ్గడం కోసం అనుష్క ఎంతగా కష్టపడుతుందో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈమె థియేటర్ లో నటించిన సైజ్ జీరో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం అనుష్క అమాంతం తన శరీర బరువును పెరిగిపోయారు.అయితే తన శరీర బరువు తగ్గడం కోసం అనుష్క ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా ఎలాంటి సినిమాలను ప్రకటించకుండా పూర్తిగా తన దృష్టిని మొత్తం తన శరీర బరువు తగ్గడం కోసం పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అనుష్క తన శరీర బరువు తగ్గడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనే విషయానికి వస్తే ఈమె 6 చిట్కాలను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. అనుష్క తన శరీర బరువు తగ్గడానికి ఎక్కువగా నీళ్ళు తాగడమే కాకుండా మధ్యమధ్యలో టెంకాయ నీళ్లు తాగడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా చర్మ సౌందర్యం కూడా పెంపొందుతుందని చెబుతున్నారు. అదే విధంగా తన ఆహారంలో భాగంగా ఎక్కువగా ఫైబర్ కలిగిన కూరగాయలు తీసుకుంటారట.

ప్రతిరోజు కేవలం మూడు సార్లు మాత్రమే కాకుండా తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవటం వల్ల తనకి ఆకలి వేయకుండా తినాలి అనే భావన కలగదని స్వీటీ చెప్పుకొచ్చారు. ఇక రాత్రి 8 గంటలకి తన డిన్నర్ పూర్తి చేస్తారట.అదేవిధంగా ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాలను తినడమే కాకుండా పూర్తిగా ఆయిల్ ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ ఆహార పదార్థాలతో పాటు పూర్తిగా యోగ, ఎక్సర్ సైజ్ వంటి వాటిని చేస్తూ తన శరీర బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తుందట.