సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమ ఆ తర్వాత శతమానంభవతి సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయ్యింది.
ఇలా ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు వల్ల బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉంటుందని అభిప్రాయ పడిన అభిమానులకు అనుపమ పెద్ద షాక్ ఇవ్వనుంది. గత కొన్ని రోజులుగా అనుపమ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అనుపమ కొత్త సినిమాలకు సైన్ చేయటం లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల కోసం అనుపమ సినిమాలకు దూరమై పెళ్లి చేసుకోనుంది.
ఇలా గత కొన్ని రోజులుగా అనుపమ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అనుపమ సినిమాలకు దూరమై ఇలా పెళ్లి చేసుకోవడానికి ముఖ్య కారణం అనుపమ తల్లిదండ్రులు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల వారి కోరిక మేరకు అనుపమ సినిమాలకు దూరమై తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.