యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నటి అనుపమ.. మొదటి వీడియో ఏంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాజాగా ఈమె కార్తికేయ 2సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు.ఇలా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందిన అనుపమ పరమేశ్వర సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకునే అనుపమ పరమేశ్వరన్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియాలో మరో అడుగు ముందుకు వేసినట్టు తెలుస్తుంది.

ప్రస్తుత కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలుఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వంటివి మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదటిసారిగా పోలాండ్ కు చెందిన ఒక వీడియోని షేర్ చేశారు.ఓ సినిమా షూటింగ్ నిమిత్తం పోలాండ్ వెళ్లినటువంటి అనుపమ అక్కడ అందాలను బంధించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఈ మొదటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.