పాపం అనుపమ.. ఇలా జరక్కుండా ఉండాల్సింది..!

anupama parameswaran comments on malayalam industry

అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన భామ అనుపమ పరమేశ్వరన్. ఆమె ఓ మలయాళీ. నిజానికి ఆమెకు పాపులారిటీ వచ్చింది ప్రేమమ్ సినిమాతో. అది మలయాళం సినిమా. ఆ సినిమాతోనే ఆమెకు సౌత్ మొత్తం పేరు వచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలో పోషించిన మేరీ జార్జ్ పాత్ర కుర్రకారుకు తెగ నచ్చింది.

anupama parameswaran comments on malayalam industry
anupama parameswaran comments on malayalam industry

ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వరుస పెట్టి వచ్చాయి. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఆఫర్స్ వచ్చాయి. వచ్చిన ఆఫర్స్ ను వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తోంది అను. కానీ.. మలయాళంలో మాత్రం సినిమాలు చేయడం లేదు.

తనకు ప్రస్తుతం ఇంత గుర్తింపు ఉన్నది అంటే దానికి కారణం మలయాళం సినీ పరిశ్రమ. కానీ.. తనకు మలయాళం పరిశ్రమ అంటే అస్సలు నచ్చదట.

తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. అయితే మలయాళం సినిమాల్లో మాత్రం ప్రస్తుతం నటించడం లేదు. గత ఐదేళ్ల నుంచి మాలీవుడ్ లో అనుపమ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన మలయాళ సినీ పరిశ్రమ అంటే అనుపమకు చాలా కోపమట. ఈ విషయాలన్నింటినీ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నది అను.

స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే తనకు తెలుగు, తమిళంతో పాటుగా మలయాళం సినిమాల్లో వరుసగా ఆఫర్లు వచ్చాయట. కానీ.. తెలుగు, తమిళంలో అనుపమ సినిమాలు చేసింది కానీ.. మలయాళంలో సినిమాలు చేయలేదు. పెద్ద పెద్ద హీరోల సరసన మలయాళంలో ఆఫర్స్ వచ్చినప్పటికీ అనుపమ నో చెప్పిందట.

అయితే దానికి కారణం తన కెరీర్ ఆరంభంలోనే మలయాళం పరిశ్రమలో తనపై జరిగిన ప్రచారం అంటూ అను.. అసలు విషయాన్ని చెప్పేసింది.

చిన్న వయసులో ఉన్నప్పుడే మలయాళం ఇండస్ట్రీలో నేను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. నేనే ఏ తప్పూ చేయలేదు. కానీ.. నన్నే ఇతరులు మోసం చేశారు. అందుకే.. ఆ ఇండస్ట్రీపై నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉంది. అందుకే అక్కడ సినిమాలు చేయట్లేదు. మలయాళం నా సొంత భాష. మా ఇండస్ట్రీ. కానీ.. నేను తెలుగు, తమిళం భాషల్లో నటించడానికే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తా.. అంటూ చెప్పుకొచ్చింది అనుపమ.

అయితే.. తనకు అక్కడ అంత ఇబ్బందికరమైన వాతావరణం ఎందుకు ఏర్పడింది. తనను ఎవరు మోసం చేశారు. ఎవరు విమర్శించారు.. అనే దాని గురించి మాత్రం అనుపమ నోరు విప్పలేదు. ఏది ఏమైనా తనను ఇంకా మరిన్ని మంచి ఆపర్స్ రావాలని కోరుకుందాం.