ఆ పాత్రలో నటించననీ ముఖ్యమంత్రికి తెగేసి చెప్పిన ఏఎన్ఆర్… అసలేం జరిగిందంటే?

తెలుగు జాతి గొప్పదనాన్ని, కీర్తిని దేశ నలుమూలల చాటిచెప్పిన గొప్ప నటుడు, రాజకీయవేత్త స్వర్గీయ నందమూరి తారక రామారావు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకానొక దశలో రాముడు, కృష్ణుడు రావణాసురుడు అంటే నందమూరి తారక రామారావు గారి పేరే చెప్పేవారు. ఎన్టీఆర్ గారు పౌరాణిక జానపద చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించగలిగారు. అలనాటి అగ్ర నటులు అయినా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారి మధ్య జరిగిన ఆసక్తికర ఘటన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఎన్టీఆర్ స్వయంగా నిర్మించి స్వీయ దర్శకత్వంలో వచ్చిన దానవీరశూరకర్ణ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ ఈ సినిమాలో రామారావు గారు కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు పాత్రల్లో తన నటన విశ్వరూపాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేశాడు. అయితే మొదట ఈ సినిమాలోని కృష్ణుడి పాత్రకు నాగేశ్వరరావు గారిని అనుకున్నారట ఎన్టీఆర్ గారు అయితే దానవీరశూరకర్ణ సినిమాలో నటించడానికి. నాగేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో అన్నగారే ఈ సినిమాలో కూడా కృష్ణుడి వేషం వేశారు. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూసిన కళ్ళతో తనను జనం చూడలేరని అలాగే తాను కర్ణుడిగా నటిస్తే పాండవులు మరుగుజ్జులుగా కనిపిస్తారని అక్కినేని నాగేశ్వరావు సున్నితంగా దానవీరశూరకర్ణ సినిమాలో చేయనని ఎన్టీఆర్ తో చెప్పారట.

దానవీరశూరకర్ణ సినిమాలో కృష్ణుడి పాత్రలో నాగేశ్వరరావును ఎలాగైనా నటింపజేయాలని ఎన్టీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తో సిఫార్సు చేయగా మరునాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఇద్దరూ కలిసి నటిస్తే జనం చూసి ఆనందిస్తారు అని జలగం వెంగళరావు చెప్పగా అందుకు నాగేశ్వరరావు ఎన్టీఆర్ కి చెప్పిన సమాధానమే చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నారని అప్పటి సినీ పెద్దలు చెబుతుంటారు. అయితే తర్వాత కొద్ది కాలానికి నాగేశ్వరరావు రామారావు గారి కాంబినేషన్లో వచ్చిన చాణుక్య చంద్రగుప్త సినిమా అద్భుత విజయం సాధించింది.