ఏఎన్ఆర్ చివరిగా డాన్స్ చేసిన సినిమా ఏంటో తెలుసా?

అలనాటి అగ్ర హీరోల్లో ఒకరైన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ అత్యున్నత వ్యక్తుల్లో ఒకరుగా చెప్పవచ్చు. అక్కినేని నాగేశ్వరావు నటించన తొలిచిత్రం ధర్మపత్ని ఈ చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత విడుదలైన సీతారామ జననం సినిమాతో నటునిగా ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించి చివరి శ్వాస వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో విశిష్ట పురస్కారాలను పొందారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత అవార్డులను పొందిన ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం బహుకరించే అత్యున్నత చలనచిత్ర పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు నాగేశ్వరరావు పొందడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయంగా చెప్పవచ్చు.

తాజాగా అక్కినేని నాగేశ్వరరావు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయానికొస్తే దర్శకరత్న దాసరి నారాయణరావు అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో తెరకెక్కిన మాయాబజార్ సినిమాలో నాగేశ్వరరావు గారు రమ్యకృష్ణ, సౌందర్య, రంభ, రోజా, మాలాశ్రీ వంటి స్టార్ హీరోయిన్లతో కలిసి
ఓ పాటకు స్టెప్పులు వేయడం జరిగింది. ఈ పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్ అక్కినేని అభిమానులకి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అయితే నాగేశ్వరరావు గారికి మాత్రం సినిమాల్లో స్టెప్పులు వేయడం ఇదే చివరి చిత్రం అని చెప్పొచ్చు.

నాగేశ్వరరావు గారు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇకపై పాటల్లో డ్యాన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను అని ప్రకటించారు. తమ అభిమాన హీరో చక్కటి హీరోయిన్లతో కలిసి డాన్సులు వేయడం చూస్తుంటే అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. అలాంటిది నాగేశ్వరరావు గారు తీసుకున్న ఈ నిర్ణయం అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ చెందారని చెప్పొచ్చు. కావున నాగేశ్వరరావు స్క్రీన్ మీద హీరోయిన్లతో ఆడిపాడిన చివరి సినిమా పాటగా చెబుతుంటారు. అన్నమాట ప్రకారం అక్కినేని నాగేశ్వర రావు మాయాబజార్ సినిమా తర్వాత ఏ హీరోయిన్ తోను స్టెప్పులు కలపలేదని చెప్పొచ్చు. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకర్షిస్తుంది.